మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కలయికలో , మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన్ “పెద్ది” జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించి, కృతజ్ఞతలు తెలిపింది. మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 135 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని ప్రకటించింది. ఈ సమావేశంలో నిర్మాత వెంకట్ సతీష్ కిలారు, దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి రవి, శశిధర్ పాల్గొన్నారు!!

