Monday, June 22, 2026
HomeEntertainmentశ్రీ మనోజ్ పరమహంస గారికి అభినందనలు

శ్రీ మనోజ్ పరమహంస గారికి అభినందనలు

ప్రముఖ ఛాయాగ్రహకులు శ్రీ మనోజ్ పరమహంస గారు చెన్నైలోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ‘ఎం.జి.ఆర్. ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ ఛైర్మన్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సంతోషదాయకం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. శ్రీ మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా తెలుగు, తమిళ చిత్రాలకు పని చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సినిమా రూపకల్పన, నిర్మాణ శైలులపై అవగాహన ఉన్న సాంకేతిక నిపుణుడాయన. చెన్నైలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ నుంచే అన్నయ్య చిరంజీవి గారు, శ్రీ రజనీకాంత్ గారు, శ్రీమతి సుహాసిని గారు, శ్రీ నాజర్ గారు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి అగ్రశ్రేణి నటులు, శ్రీ పి.సి.శ్రీరామ్, శ్రీ పి.ఎస్.నివాస్ లాంటి సాంకేతిక నిపుణులు వచ్చారు. శ్రీ మనోజ్ పరమహంస గారి నేతృత్వంలోనూ ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు రావాలని ఆకాంక్షిస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments