వందలాది నాటకాలు, డ్రామాలతో అలరించిన పాపులర్ స్టేజి ఆర్టిస్ట్ టి.రాము నటించి, దర్శకత్వం వహించిన చిత్రం “గాలి”. సంధ్యా ఫిలిమ్స్ పతాకంపై రోజారమణి సమర్పణలో చందా లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలై… విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
అమ్మవారికి… భక్తునికి నడుమ జరిగే సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్ధకులకు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రెండో చిత్రాన్ని త్వరలో ప్రకటించనున్నామని దర్శకుడు టి. రాము తెలిపారు!!

